
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
చందుర్తి (వేములవాడ): సీసీ కెమెరాలు నేరాల నియంత్రణకు దోహదపడుతాయని ఎస్పీ మహే శ్ గితే అన్నారు. చందుర్తి మండలం కిష్టంపేటలో ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజల సహకారంతో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఏదైన సంఘటన జరిగితే గుర్తించేందుకు ఉపయోగపడుతాయని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనలన్నీ వీటి ద్వారానే ఛేదించామన్నారు. అనంతరం చందుర్తి సర్కిల్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరేడ్, కిట్ ఆర్టికల్స్, రిసెప్షన్, సీసీటీఎన్‌ఎస్ విభాగాల పనితీరు, పలు రికార్డులను పరిశీలించారు. దర్యాప్తులో ఉన్న కేసులపై రివ్యూ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై క ఠినంగా వ్యవహరించాలన్నారు. ఎస్పీ వెంట చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్‌లు ఉన్నారు.
గోవిందరాజుల సన్నిధిలో ఎస్పీ పూజలు
చందుర్తి మండలం సనుగుల గ్రామశివారులోని గోవిందరాజుల స్వామి ఆలయంలో ఎస్పీ మహేశ్ గితే పూజలు చేశారు. మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సనుగుల సింగిల్‌విండో మాజీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.