
బోనమో పోచమ్మ
సిరిసిల్ల: కార్మిక క్షేత్రం ఆదివారం బోనమెత్తింది. సిరిసిల్లలో ఆషాఢమాసం బోనాల జాతర సాగింది. ఊరంతా పోచమ్మకు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ, మహంకాలి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. విద్యానగర్‌లో ఏఎంసీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపా, తిరుపతిరెడ్డి దంపతులు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి దంపతులు స్థానికులతో కలిసి బోనాలు తీశారు. అభయాంజనేయ సొసైటీ, నెహ్రూనగర్‌లో మాజీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ దంపతులు, గుండ్లపల్లి రామానుజం, చిలుక నారాయణ, గౌతమ్, చిమ్మని ప్రకాశ్, గాజుల భాస్కర్, దూడం శ్రీనివాస్, జక్కని సత్యనారాయణ, జగ్గాని మల్లేశంయాదవ్, తాటి వెంకన్న, ఇంజపురి మురళి స్థానికులతో పోచమ్మతల్లికి మొక్కులు చెల్లించారు. పాతబస్టాండులోని మైసమ్మతల్లికి, కొత్తచెరువు కట్ట వద్ద కట్టమైసమ్మకు యాట పోతులు, కోళ్లతో మొక్కులు చెల్లించారు.

బోనమో పోచమ్మ