
నేడు సిరిసిల్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాక
సిరిసిల్ల: జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ మంగళవారం వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో పదోతరగతి విద్యార్థులకు ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేస్తారని వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్‌ఆర్)లో భాగంగా 3,841 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తారని తెలిపారు.
బాధితులకు భరోసాగా గ్రీవెన్స్ డే
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. 28 ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించాల్సిందిగా ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ వివిధ సమస్యలతో ఠాణాలకు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.
విద్యార్థుల సంఖ్య పెంచాలి
బోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని వరంగల్ రీజి యన్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. మండలకేంద్రంలోని హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఎంఈవో శ్రవణ్‌కుమార్, హెచ్‌ఎంలు భూమయ్య, కనకయ్య పాల్గొన్నారు.
మద్యపాన వ్యసనంతో అనర్థాలు
సిరిసిల్ల: మద్యపాన వ్యసనంతో అనేక అనర్థాలు ఉంటాయని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సైక్రియాట్రిస్ట్ డాక్టర్ బి.ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. గణేశ్‌నగర్‌లో సోమవారం మైండ్‌కేర్, కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పవర్‌లూమ్ కార్మికులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మద్యపానంతో లివర్, గుండె సంబంధిత వ్యాధులు, మెదడుపై ప్రభావంతో మెమొరీ లాస్, డిప్రెషన్, ఆందోళన, నిద్ర లేమి సమస్యలు ఏర్పడుతాయన్నారు. మద్యపానాన్ని మానేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. సైకా లజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ కుటుంబ కలహాలు, విడాకులు, పిల్లలపై ప్రతికూల ప్ర భావంతో వ్యక్తి చేసే పనితీరు తగ్గిపోతుందన్నారు. వస్త్రోత్పత్తిదారులు మంచె మల్లయ్య, సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, నేత కార్మికులు పాల్గొన్నారు.
చేతికొచ్చిన ఆయిల్‌పామ్ పంట
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వల్లంపట్లలో ఆయిల్‌పామ్ సాగుచేయగా మొదటిసారిగా రైతుకు రెండు టన్నుల పంట చేతికొచ్చినట్లు జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి లత తెలిపారు. వల్లంపట్ల గ్రామంలో కడుదల కిషన్ ఆయిల్‌పామ్ తోటను సోమవారం పరిశీలించారు. 2022లో సాగుచేసిన రైతులకు పంట చేతికొస్తుందని తెలిపారు. ఒక్కో ఎకరంలో 8 టన్నుల వరకు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా 270 ఎకరాలలో పంట సాగుచేస్తున్నట్లు వివరించారు.

నేడు సిరిసిల్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాక

నేడు సిరిసిల్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాక

నేడు సిరిసిల్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాక

నేడు సిరిసిల్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాక