
కులగణనతో ఆదర్శంగా నిలిచాం
సిరిసిల్ల: బీసీ కులగణనన చేపట్టి దేశానికి రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అందించే ఆర్డినెన్స్‌తో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధి చాటుకుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆర్డినెన్స్ తేవడంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలో సోమవారం కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తెచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి దెబ్బకు కేంద్రం దిగి వచ్చి కులగణననకు అంగీకరించిందన్నారు. పేదల కోసం ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా నిలువాలని కోరారు. సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చొప్పదండి ప్రకాశ్, సూర దేవరాజు, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, గోలి వెంకటరమణ, జాల్గం ప్రవీణ్, బొప్ప దేవయ్య, గోనె ఎల్లప్ప, కల్లూరి చందన, వేముల దామోదర్, కోడం అమర్‌నాథ్, గుండ్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు
వేములవాడరూరల్: గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్‌కార్డు మంజూరు చేయలేదని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక పేదలకు పెద్దపీఠ వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని రూరల్ మండల ప్రజాపరిషత్‌లో సోమవారం 9 మందికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, 44 మందికి సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను అందించారు. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కంటిన్యూ చేస్తూనే కొత్త పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
కృతజ్ఞత ర్యాలీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్