
రాగట్లపల్లిలో చిరుత సంచారం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రాగట్లపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన రైతు సురేశ్ సోమవారం ఉదయం తన పొలానికి వెళ్లిన సమయంలో చిరుతను చూశాడు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతులు పంట పొలాల వద్దకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుత పాదముద్రలను గుర్తించారు. సెక్షన్ ఆఫీసర్ సఖారం మాట్లాడుతూ.. చిరుత కోసం ఎల్లారెడ్డిపేట శివారు నుంచి వెంకటాపూర్ శివారు వరకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.