
ఆలకించి.. ఆదేశించి
● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
● వివిధ సమస్యలపై 244 అర్జీలు
● పరిష్కారానికి ఆదేశాలు
సిరిసిల్లఅర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కా రం కాకపోవడంతో బాధితులు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు విన్నవించారు. సమస్యలు ఆలకించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ సమస్యలపై 244 దరఖాస్తులు వచ్చాయి. ఆయా దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్, డీఆర్‌డీవో శేషాద్రి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
పట్టా పాసుబుక్కులు ఇప్పించండి
నేను 1982లో కనగర్తికి చెందిన కాసర్ల రాజిరెడ్డి వద్ద 5.03 ఎకరాల భూమి కొనుగోలు చేశాను. గత 43 ఏళ్లుగా పట్టా చేయకుండా మభ్యపెడుతున్నాడు. పట్టా చేయమని అడిగితే బెదిరిస్తున్నాడు. రాజిరెడ్డి నుంచి కొనుగోలు చేసిన భూమికి పట్టా పాసుబుక్కు ఇప్పించాలి.
– ఊరడి దేవయ్య, కనగర్తి(కోనరావుపేట)
చర్యలు తీసుకోండి
చింతల్‌ఠాణా పునరావాసకాలనీలో ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మిస్తున్నారు. ఆరేళ్ల బాలుని మృతికి కారణమైన బాలకిషన్‌పై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
– లింగంపల్లి తిరుపతి(చింతల్‌ఠాణా), వేములవాడ అర్బన్
విచారణ చేపట్టండి
మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ల తారుమారుపై చర్యలు తీసుకోవాలి. ముంపు గ్రామమాల్లో సుమారు 300 ప్లాట్ల వరకు లేఅవుట్ లేకుండా మార్చుకున్నారు. విచారణ చేసి అక్రమంగా మార్పులు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి.
– శేర్ల మురళి, చింతల్‌ఠాణా(వేములవాడ అర్బన్)
చెరువులను ఆక్రమించారు
సర్ధాపూర్‌లోని జనగలకుంట, తూముకుంట, గొలుసుకట్టు చెరువులను గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించి, పంటల సాగు చేస్తున్నారు. మంలోని చెరువులను సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలి. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. – సర్ధాపూర్ ముదిరాజ్ కులస్తులు

ఆలకించి.. ఆదేశించి

ఆలకించి.. ఆదేశించి

ఆలకించి.. ఆదేశించి

ఆలకించి.. ఆదేశించి