
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్
ముస్తాబాద్(సిరిసిల్ల): వ్యవసాయానికి నాణ్య మైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తున్నామని సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో లూజ్ విద్యుత్ తీగల మరమ్మతు పనులను డైరెక్టర్ అంజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. అంజిరెడ్డి మాట్లాడుతూ సెస్ పరిధిలో మెరుగైన విద్యుత్‌ను రైతులకు, గృహ వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. వినియోగదారులు బకాయిలు సకాలంలో చెల్లించి సంస్థను కాపాడుకోవాలని కోరారు. ఏఈ విష్ణుతేజ, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.
● సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి