
కనికరించని కాలం
సిరిసిల్ల: ముందు మురిపించిన కాలం.. తీర సమయానికి ముఖం చాటేసింది. ముందస్తుగా కురిసిన వర్షాలకు వరినారు తుకం పోసుకున్న రైతులు నేడు ఆందోళన చెందుతున్నారు. నారు వయసు నెలరోజులు దాటుతుండడంతో ఏం చేయాలో తోచడం లేదు. వర్షాలు సరిగా కురువక భూగర్భజలాలు సైతం అడుగంటుతున్నాయి. బావులు, బోర్లలో నీటి తడి రావడం లేదు.
సాగునీటి వనరులు వెలవెల
జిల్లాలోని సాగునీటి వనరుల్లో నీరు ఇంకిపోతుంది. మిడ్‌మానేరులో 6 టీఎంసీలు ఉండగా, ఎగువమానేరు, అనంతగిరి, మల్కపేట రిజర్వాయర్‌లలో అ ర టీఎంసీకి మించి నీరు లేదు. మూలవాగు ఎండిపోయింది. జిల్లా వ్యాప్తంగా వంద ఎకరాల ఆయక ట్టు కంటే ఎక్కువ ఉన్న చెరువులు 106 ఉండగా.. వంద ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 560 ఉన్నాయి. మరో 23 ఊట చెరువులు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోయకపోవడంతో గో దావరి జలాలు జిల్లాకు చేరడం లేదు. ఎల్లంపల్లి ద్వారా నీరు వస్తే మధ్యమానేరు, అనంతారం, మ ల్కపేట రిజర్వాయర్లకు జలకళ రానుంది. ఇవి నిండితే సగం జిల్లాకు సాగునీటి ఇబ్బందులు తప్పుతాయి.
ముసురు వర్షాలే దిక్కు
ఈ సీజన్‌లో అప్పుడప్పుడు ముసురు వర్షాలు కురుస్తుండడంతో పత్తి పంటకు అనుకూలంగా ఉన్నాయి. నల్లరేగడి నేలల్లో కొద్దిగా నీరుండి ఇబ్బందిగా ఉన్నా.. చౌక నేలలకు ఇబ్బంది లేదు. జిల్లాలో అత్యధికంగా వరిపంట సాగవుతుండగా.. ఈ ఏడాది మంచి వర్షాలు లేక వానాకాలంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మరో వారం రోజుల్లో భారీ వర్షాలు పడితేనే వరి పంటకు అనువైన పరిస్థితులు ఉంటాయి.
పంటల సాగు విస్తీర్ణం
వరి : 1,84,860 ఎకరాలు
వరినాట్లు వేసింది: 55,458 ఎకరాలు
పత్తి : 49,760 ఎకరాలు
విత్తుకున్న పంట : 48,764 ఎకరాలు
ఇతర పంటలు : 9,153 ఎకరాలు
సాగుచేసిన ఇతర పంటలు : 1.830 ఎకరాలు
మొత్తం పంటల సాగు : 2,43,773 ఎకరాలు
జిల్లాలో లోటు వర్షపాతం
రోహిణీకి ముందే తొలకరి
నేడు ముఖం చాటేసిన వరణుడు
పత్తికి అనుకూలం.. వరికి ప్రతికూలం
రైతులు ఆందోళన చెందొద్దు
ఎదిగిన వరినారు మడిని చూపుతున్న ఇతను ద్యావల శంకర్. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన శంకర్ రెండున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు. బోరు నీరు పోస్తుండడంతో నెల క్రితం తుకం చేసి, నారు పోసుకున్నాడు. ఇప్పుడు నారు ఎదిగింది. బోరులో నీరు రావడం లేదు. వర్షాలు సరిగా పడకపోవడంతో 35 రోజుల నారు ముదిరిపోతుందేమోనని శంకర్ ఆందోళన చెందుతున్నాడు. మరో పది రోజుల్లో వర్షాలు పడకుంటే నారు పనికి రాకుండా పోతుందని ఆందోళన చెందుతున్నాడు.
లేత పత్తి చేనులో డౌర కొడుతున్న ఇతను కోనరావుపేట మండలం కనగర్తికి
చెందిన మోకాళ్ల అంజిరెడ్డి. రోహిణీ కార్తెలో కురిసిన వర్షాలకు భూమి తడవడంతో ఏడు ఎకరాల్లో పత్తి వేశాడు. అప్పుడప్పుడు కురిసిన వర్షంతో పత్తి మొలకెత్తడంతో ఇప్పుడు కలుపు తీస్తూ డౌరా కొడుతున్నాడు. వాతావరణం పత్తికి అనుకూలంగా
ఉండడంతో రైతులు పత్తి చేలల్లో పనులు చేస్తున్నారు.

కనికరించని కాలం