
పోలీస్ శాఖ పటిష్టం
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే
వీర్నపల్లి(సిరిసిల్ల): శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖను మరింత పటిష్టం చేస్తున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో నూతన పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణానికి శనివారం భూమిపూజ చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ వీర్నపల్లిలో రెండు ఎకరాలలో నూతన పోలీ స్‌స్టేషన్ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసుశాఖ ముందంజలో ఉందన్నారు. శాంతి భద్రతల ఎక్కడ అదుపులో ఉంటాయో.. అక్కడ అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.మహేందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్సైలు లక్ష్మణ్, రమాకాంత్, ఎల్లయ్యగౌడ్, రాహుల్‌రెడ్డి, తహసీల్దార్ ముక్తార్‌పాషా, ఆర్‌ఐ శివకుమార్, ఏఎంసీ చైర్మన్ రాములునాయక్, సెస్ డైరెక్టర్ మల్లేశం పాల్గొన్నారు.
నేడు ‘దర్పణం’ పుస్తకావిష్కరణ
సిరిసిల్లకల్చరల్: కోనరావుపేటకు చెందిన చక్రాల మహేశ్ రాసి, వెలువరించిన తొలి కవితా సంపుటి ‘దర్పణం’ పుస్తకాన్ని ఆదివా రం ఆవిష్కరించనున్నట్లు సిరిసిల్ల సాహితీ సమితి నిర్వాహకుడు డాక్టర్ జనపాల శంకరయ్య ప్రకటనలో తెలిపారు. అతిథిగా పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.కృష్ణ హాజరవుతున్నారని పేర్కొన్నారు. గాంధీనగర్ హనుమాన్ ఆలయంలో ఉదయం 10 గంటలకు పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.