
ప్రతిభావంతులకు పోపా చేయూత
సిరిసిల్లకల్చరల్: ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు (పోపా) పద్మశాలి అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ చేదోడుగా నిలుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు పోపా ఆధ్వర్యంలో పురస్కారాల ప్రదానోత్సవం పట్టణంలోని పద్మశాలి కల్యాణభవనంలో శనివారం నిర్వహించారు. టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ప్రముఖ వైద్యులు గూడూరి రవీందర్, గీతావాణి, ఎంఈవోలు దూస రఘుపతి, కృష్ణహరి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్, మచ్చ ఆనందం, న్యాయవాది గెంట్యాల భూమేశ్, మామిడాల భూపతి తదితరులు హాజరై మాట్లాడారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, ఎప్సెట్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. పోపా ప్రతినిధులు దేవత ప్రభాకర్, చేరాల ప్రభాకర్, బైరి రవీందర్, ఆడెపు వేణు, మోర దామోదర్, అంకారపు జ్ఞానోభ, వాసాల హరిప్రసాద్, గడ్డం సత్యనారాయణ, శ్రీపతి భూమేశ్, గుండెల్లి రవి, ధ్యావనపెల్లి పరమేశ్వర్, బండారి శ్రీనివాస్ పాల్గొన్నారు.