
ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకోవాలి
సిరిసిల్లటౌన్: దివ్యాంగులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి రాధికాజైస్వాల్ కోరారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం శిబిరాన్ని బుధవారం సందర్శించారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో గుర్తించిన పిల్లలకు సదరం సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన చేపల సీడ్ అందించాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వం ఈ సీజన్‌లో జలాశయాలు, చెరువులు, కుంటల్లో వేసేందుకు నాణ్యమైన చేపల సీడ్ అందించాలని జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ చొప్పరి రామచంద్రం కోరారు. మండలంలోని అనంతారంలో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందించకపోతే సమాన విలువైన నిధులు మత్స్యపారిశ్రామిక సంఘాల ఖాతాల్లో జమచేస్తే సభ్యులు నాణ్యమైన చేపల సీడు కొనుక్కుంటారని అభిప్రాయపడ్డారు. అన్నపూర్ణ ప్రాజెక్టు, ఎగువ, మధ్య, మానేరు జలాశయాల పరిధిలోని సభ్యులు తమ లైసెన్స్‌లను రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 1 నుంచి ఆగస్టు 31 వరకు అన్నపూర్ణ ప్రాజెక్టు, ఎగువ, మధ్యమానేరు జలాశయాలలో మత్స్యకార్మికులు చేపలు పట్టవద్దని కోరారు.