
చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
సిరిసిల్లకల్చరల్: చట్టాలపై సంపూర్ణ అవగాహన పెంచుకునేందుకు ప్రతీ మహిళా ముందుకు రావాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు. మంగళవారం గోపాల్‌నగర్‌లోని పంచాయతీరాజ్ అతిథి గృహ సమావేశ మందిరంలో డీఎల్‌ఎస్‌ఏ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన స దస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాధి కా జైస్వాల్ మాట్లాడుతూ, సర్దుకుపోలేని సమస్యల కారణంగా కుటుంబంలోని కలతల్ని, దంపతుల మధ్య సర్దుబాటు లేమి వంటి సమస్యలను న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మా జీ కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్, న్యాయవాదు ల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్‌సభ్యులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కొత్తచెరువుపై ప్రత్యేక దృష్టి
సిరిసిల్లటౌన్: కొత్తచెరువు అందాల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖాదీర్‌పాషా అన్నారు. మంగళవారం ఉదయం కొత్తచెరువు బండ్, పార్కులను పరిశీలించి మాట్లాడారు. కొత్తచెరువు పార్కులో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించి వాటిని అక్కడే ఎరువు తయారు చేసి చెట్లకు వేయాలని సూచించారు. పార్కు, బండ్‌లను శుభ్రంగా ఉంచాలని, వాకర్స్‌కు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఈఈ రఘు, ఉమర్ తదితరులున్నారు.
ఉన్నత శిఖరాలకు ఎదగాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీని తనిఖీ చేసి విద్యార్థులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్‌వాలా వంటి కోచింగ్ సంస్థలతో ఆన్‌లైన్‌లో జేఈఈ, నీట్ శిక్షణ అందజేస్తామని పేర్కొన్నారు. అధ్యాపకులు కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచాలన్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు పాల్గొన్నారు.
జిల్లా అంతటా చిరు జల్లులు
సిరిసిల్ల: జిల్లావ్యాప్తంగా మంగళవారం చిరుజల్లులు కురిశాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో అత్యధికంగా 10.8 మి.మీ వర్షం పడగా, రుద్రంగి 1.9, చందుర్తి 0.5, వేములవాడరూరల్ 0.4, వేములవాడ 3.7, సిరిసిల్ల 5.2, కోనరావుపేట 4.5, వీర్నపల్లి 8.3, గంభీరావుపేట 7.5, ముస్తాబాద్ 5.9, తంగళ్లపల్లి 9.3, ఇల్లంతకుంటలో 3.8 మి. మీ వర్షం కురిసింది. బోయినపల్లిలో పెద్దగా వర్షం కురవలేదు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి