
శ్రామికుల సమరం
● ¯ólyýl$ §ólÔèæ-ÐéÅç³¢ ˘ ÝëÆý‡Ó-{†MýS çÜÐðl$à ● పోరుకు సబ్బండ వర్గాల కార్మికులు సిద్ధం
జిల్లాలోని కార్మిక, కర్షకుల వివరాలు..(సుమారుగా)
బీడీ కార్మికులు 86,000
పవర్‌లూం 15,000
గ్రామపంచాయతీ 1,300
అంగన్‌వాడీలు 500
ఆశాలు 450
మున్సిపల్ 700
గార్మెంట్స్ 1,300
హమాలీ 2,500
మధ్యాహ్నం భోజనం 600
రైతులు 1,13,000
భవన కార్మికులు 5,000
సిరిసిల్లటౌన్: హక్కుల సాధనకు శ్రామికవర్గాలు స మర శంఖాన్ని పూరిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం కార్మిక, కర్షక చట్టాలను కుదించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరల తగ్గింపు, ీతదితర డిమాండ్ల సాధనకు కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, అన్నిరంగాల మద్దతుతో మంగళవారం దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నాయి.
శ్రామికవర్గాలే అధికం..
జిల్లాలో దాదాపు 80శాతం కార్మిక, కర్షక వర్గాలకు చెందినవారున్నారు. జిల్లా కేంద్రంలో వస్త్ర పరిశ్రమ విస్తరించి ఉండగా నేత కార్మిక కుటుంబాలు సుమారు 16 వేల వరకు ఉన్నాయి. దీనికి తోడు బీడీ పరిశ్రమ కూడా విస్తరించి ఉంది. జిల్లాలో సార్వత్రిక సమ్మైపె అన్నివర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, ఏఐఎఫ్‌టీయూ తదితర ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మైపె సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సమ్మె నేపథ్యం, డిమాండ్లు..
● నాలుగు లేబర్ కోడ్‌లు రద్దుచేయాలి. అన్ని వర్గా ల కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వా లి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాలు రద్దుచేయాలి.
● అంసంఘటిత, వ్యవసాయ కార్మికులు సహ అన్నివర్గాల వారికి సామాజిక భద్రత కల్పించాలి. పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలి. ధరల పెరుగుదల నియంత్రించాలి.
● ప్రభుత్వ వైద్య, విద్య వ్యవస్థలను బలోపేతం చేసి పేదలకు ఉచితంగా అందించాలి. ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 కూలి ఇప్పించి, ఏటా 200 రోజులు పనికల్పించాలి. ఈపథకాన్ని పట్టణాలకు కూడా విస్తరింపజేయాలి.
● విద్యుత్ సవరణ బిల్లు–2022ను ఉపసంహరించాలి. అన్నిరంగాల కార్మికుల వివరాలు సేకరించి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.