
శీత్లాభవాని వేడుకలు
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట/వీర్నపల్లి/రుద్రంగి/చందుర్తి: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లా భవాని వేడుకలు మంగళవారం జిల్లాలోని తండాల్లో ఘనంగా నిర్వహించారు. గిరిజన యువతులు, చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారి గుడికి తరలివచ్చి నైవేద్యం సమర్పించారు. పశువులు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, బుగ్గరాజేశ్వరతండా, కిష్టునాయక్‌తండా, దేవునిగుట్టతండా, గుంటపల్లిచెరువుతండా, వీర్నపల్లి మండలంలో, రుద్రంగి మండలం హర్యానాయక్, గువ్వలబండ, బడితండా, దసరానాయక్ తండా, చందుర్తి మండలం దేవుని, జలపతితండాలు, గంభీరావుపేట మండలం జగదాంబతండాలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేశారు.

శీత్లాభవాని వేడుకలు

శీత్లాభవాని వేడుకలు