ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు
● పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం ● ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందుతున్నాయని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్ పేర్కొన్నారు. మండలంలోని సనుగులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేసిన అనంతరం చౌడాలమ్మ కల్యాణ మహోత్సవంలో పాల్గొని మాట్లాడారు. గుడిసె లేని గ్రామాలే లక్ష్యమన్నారు. పేదల సొంతింటి కల ఇందిరమ్మతో నెరవేరుతుందన్నారు. నిబంధనల మేరకు నిర్మించుకుంటే బిల్లులు వస్తాయని తెలిపారు. ప్రజాప్రభుత్వంపై బురదజల్లే ప్రతిపక్షాలకు మెనిఫెస్టోలో లేని సన్నబియ్యాన్ని అందజేయడం చెంపపెట్టులాంటిదన్నారు. రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీలు నాగం కుమార్, పొద్దుపొడుపు లింగారెడ్డి, సనుగుల సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ముస్కు ముకుందరెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు ఏగోలపు శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ మ్యాకల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యం
వేములవాడ: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 65 మంది లబ్ధిదారులకు రూ.28.48లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి, ఎల్‌వోసీల ద్వారా ఇప్పటి వరకు రూ.20కోట్ల పైచిలుకు మంజూరు చేయించినట్లు విప్ తెలిపారు.


