నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

Mar 28 2025 6:18 AM | Updated on Mar 28 2025 6:16 AM

● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

ముస్తాబాద్‌(సిరిసిల్ల): వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని.. మిషన్‌ భగీరథ నీరు నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. ముస్తాబాద్‌, చిప్పలపల్లి గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరాను గురువారం కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. చిప్పలపల్లిలో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని, కోళ్లమద్ది రిజర్వాయర్‌ నుంచి నీటిని వాడుకోవాలని సూచించారు. ముస్తాబాద్‌ డబుల్‌బెడ్‌రూమ్‌ కాలనీతోపాటు ఎస్సీకాలనీల్లో వెంటనే నీటి సరఫరా కావాలని సూచించారు. అనంతరం నామాపూర్‌ మోడల్‌స్కూల్‌ను తనిఖీ చేశారు. పోతుగల్‌లో పీహెచ్‌సీలో రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈఈ జానకి, డీఈలు ప్రేమ్‌కుమార్‌, రాము, తహసీల్దార్‌ సురేశ్‌, ఎంపీడీవో బీరయ్య, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, వైద్యాధికారి గీతాంజలి, ఈవో రమేశ్‌, ప్రిన్సిపాల్‌ నర్సింహారాజు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలను నిర్మూలించాలి

సిరిసిల్లకల్చరల్‌: జిల్లాలో మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశంలో ఎస్పీ మహేశ్‌ బీ.గీతేతో కలిసి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణా, విక్రయించి నా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులను సమన్వ యం చేసుకుంటూ డ్రగ్స్‌ నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ కమి షనర్లు సమ్మయ్య, అన్వేశ్‌, జిల్లా వైద్యాధికారి రజిత, ఇంటర్మీడియెట్‌ విద్యాధికారి శ్రీనివాస్‌, కార్మికశాఖ అధికారి నజీర్‌ అహ్మద్‌, డీఏవో అఫ్జ ల్‌ బేగం, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ అనూష పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement