
‘ఖేలో ఇండియా’ పారా గేమ్స్‌కు జిల్లా క్రీడాకారులు
సిరిసిల్ల: ఢిల్లీలో జరిగే ‘ఖేలో ఇండియా’ పారా గేమ్స్‌కు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన మిట్టపల్లి అర్చన(46), వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన భూక్యా సక్కుబాయి(40) ఢిల్లీలో ఈనెల 20 నుంచి 27 వరకు జరిగే పోటీలకు ఎంపికయ్యారు. వీరిని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా క్రీడల అధికారి అజ్మీరా రాందాస్, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం సోమవారం అభినందించారు.
రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
వేములవాడఅర్బన్: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వేములవాడ ఏరియా ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను, రోగులకు అందుతును సేవలను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆస్పత్రి భవన నమూనాలో ఉన్న విధంగా వార్డులు, గదులను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తదితరులు ఉన్నారు.
మోడల్‌స్కూల్‌లో ఎన్సీఈఆర్టీ బృందం
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలో ని రహీంఖాన్‌పేట ప్రభుత్వ మోడల్‌స్కూల్ ను సోమవారం ఎన్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకు డు జగన్ సందర్శించారు. రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల పనితీరు పరిశీలిస్తున్నట్లు తెలి పారు. విద్యార్థుల ఎస్‌ఏ పరీక్షలు, బేస్‌లైన్ టెస్ట్, మిడ్‌లైన్ టెస్టు, టీచర్స్ డైరీలు, ఐఎఫ్‌బీ ప్యానెల్ పనితీరు పరిశీలించారు. ప్రిన్సిపాల్ గంగాధర్, సీఆర్పీ నర్సయ్య ఉన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
సిరిసిల్లటౌన్: జిల్లాస్థాయి తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఎంపిక పోటీలు సోమవారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగాయి. పోటీలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ ఆజాద్ ప్రారంభించారు. 14, 16, 18, 20 విభాగాల్లో పోటీలు జరిగాయి. ప్రతిభ చూపిన క్రీడాకారులను ఈనెల 23న జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలి పారు. పీఈటీలు కడారి అశోక్, మహేందర్, నవీన్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కన్కం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బట్ట సంచులే ముద్దు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో పర్యావరణాన్ని కాపాడేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెడ్‌మాస్ట ర్ అనురాధ మాట్లాడుతూ ప్లాస్టిక్ బూతాన్ని తరిమివేయాలని కోరారు. విద్యార్థులకు బట్టసంచులను అందజేశారు. టీచర్లు రాజేశ్వరరావు, శారద, రమేశ్, శైలజ, శిరీష, పద్మ, రవీందర్‌రెడ్డి, సుమలత, సంతోష్ తదితరులు ఉన్నారు.

‘ఖేలో ఇండియా’ పారా గేమ్స్‌కు జిల్లా క్రీడాకారులు

‘ఖేలో ఇండియా’ పారా గేమ్స్‌కు జిల్లా క్రీడాకారులు