
పారిశుధ్యం నిర్వహణపై శ్రద్ధ పెట్టండి
● డ్రై డే విధిగా పాటించాలి ● జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ● గిరిజన పల్లెల్లో డీపీవో తనిఖీలు
సిరిసిల్ల: పల్లెల్లో పారిశుధ్యం నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య కోరారు. రుద్రంగి మండలం మానాల శివారులోని చింతామనితండా, రూప్లానాయక్‌తండా, సర్పంచ్‌తండా, దెగావత్‌తండా, బడితండా, గైదిగుట్టతండా, అడ్డబోరుతండా గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. డీపీవో మాట్లాడుతూ స్వచ్ఛదనం–పచ్చదనం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, డ్రెయినేజీలను శుభ్రం చేయాలని ఆదేశించారు. పాత ఇళ్లను, కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లను ఖాళీ చేయించాలని డీపీవో ఆదేశించారు. రుద్రంగి ఎంపీడీవో నటరాజ్, ఎంపీవో సుధాకర్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.