
● జర్రున జారుడే ● ఫస్ట్‌గ్రేడ్ సిరిసిల్ల బల్దియాలో వసత
సిరిసిల్లటౌన్: స్మార్ట్ సిరిసిల్ల శివారు కాలనీలు వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు వరదనీటితో పాటు, బురద రోడ్లతో జనం అపసోపాలు పడుతున్నారు. విలీన గ్రామాల్లో సీసీరోడ్లు లేక ప్రజలు బురదలో సర్కస్ ఫీట్లు చేయాల్సిన దుస్థితి. అభివృద్ధిలో పోటీపడిన సిరిసిల్ల పట్టణంలో పలుచోట్ల బురదరోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలపై కథనం.
రోడ్లపై గుంతలు.. ఎన్నాళ్లీ చింతలు..
స్మార్ట్ సిరిసిల్లలో ప్రధాన, లింకు, శివారు కాలనీల్లోని రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షాకాలంలో మోకాల్లోతు గుంతలతో ప్రజలకు చింతలు త ప్పడం లేదు. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల మున్సిపల్ పరిధి సుమారు 272 చ.కి.మీ విస్తరించి ఉంది. మరో 98.50 కి.మీ రోడ్లు నిర్మించాల్సి ఉంది..
సమస్యలు ఇలా..
● పట్టణంలో దశాబ్దాల క్రితం వేసిన రోడ్లను పునర్మిర్మాణం చేయక, విలీన గ్రామాల్లో అభివృద్ధి లేక రోడ్లు ఛిద్రమవుతున్నాయి.
● అన్ని వార్డుల్లో నూరుశాతం మౌలిక వసతుల క ల్పనకు పలు దఫాలుగా రూ.100 కోట్లకు పైగా ఖర్చయింది. వాటితో మూడింటా రెండోవంతు రోడ్లు నిర్మించారు. మిగతా వాటిని కొత్తగా ని ర్మించడానికి ప్రభుత్వం నిధులు అందించాల్సి ఉంది.
● చెరువు కాల్వల కబ్జాతో ఏటా వర్షాలతో పట్టణం ముంపునకు గురై రోడ్లు కూడా భారీగా దెబ్బతింటున్నాయి. వరదలు రాకుండా సరైన చర్యలు తీసుకోవడం లేదు.
● ముఖ్యంగా విలీనగ్రామాల ప్రజలు అరిగోస పడుతున్నారు. కొన్ని రోడ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయినా పూర్తికాలేదని ఆరోపిస్తున్నారు.
● మట్టిరోడ్ల స్థానంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైన ప్రాంతాల్లో వెంటనే పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

● జర్రున జారుడే ● ఫస్ట్‌గ్రేడ్ సిరిసిల్ల బల్దియాలో వసత