
గ్రీవెన్స్‌తోబాధితులకు భరోసా
● ఎస్పీ మహేశ్ బి గితే
సిరిసిల్లక్రైం: సమస్యల పరిష్కారం లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు.
పీపీ, కోర్టు పీసీలకు ప్రశంస
నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, శిక్ష శాతాన్ని పెంచడంతో సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. నిందితులకు శిక్షల పడేలా కృషి చేసిన పీపీలు, కోర్టు కానిస్టేబుళ్లను సోమవారం అభినందించారు. ఆరు నెలల్లో 48 కేసుల్లో నిందితులకు జైలుశిక్షలు పడ్డాయని గుర్తు చేశారు. పీపీలు వేముల లక్ష్మీప్రసాద్, శ్రీనివాస్, లక్ష్మణ్, సందీప్, సతీశ్, విక్రాంత్, కోర్టు కానిస్టేబుళ్లకు ప్రశంసాపత్రాలు అందించారు. ముస్తాబద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హత్య కేసులో ముగ్గురు నిందుతులకు జీవిత ఖైదు పడటంలో కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ దేవేందర్, రాజేందర్, సీఏంఎస్ కానిస్టేబుల్ నవీన్‌ను ప్రత్యేకంగా అభినందించారు.