స్థానిక సమరానికి బీజేపీ సై | - | Sakshi
Sakshi News home page

స్థానిక సమరానికి బీజేపీ సై

Jul 8 2025 4:33 AM | Updated on Jul 8 2025 4:35 AM

● కేంద్రమంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కమల దళం సై అంటోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో వాతావారణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ హవా ఎంత ముఖ్యమో, పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి ఉన్న ఇమేజ్‌ కూడా అంతే ముఖ్యమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకని పంచాయతీ, మండల, మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలని సూచించారు. మిగిలిన వారంతా పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు సహా శ్మశానవాటికల నిర్మాణం వరకు కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారనే విషయాన్ని ఇంటింటికీ, గల్లీగల్లీకి తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో విజయాలు సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, పార్లమెంట్‌కన్వీనర్‌ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా అద్దంకి దయాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మెదక్‌ ఉమ్మడి జిల్లాకు, రాష్ట్రసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరంగల్‌ ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా కాంగ్రెస్‌

వేములవాడ/వేములవాడరూరల్‌: రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మార్పీఎస్‌ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగ 31 ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో నాయకులు పుల్కం రాజు, బింగి మహేశ్‌, పీర్‌ మహ్మద్‌, ఎల్లగౌడ్‌, బొడ్డు రాములు, సందీప్‌, సదానందం, మల్లేశం, రాజు, నాగుల విష్ణు, కరుణాకర్‌, తోట రాజు, నాగరాజు, మధు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలి

వేములవాడఅర్బన్‌: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను రాష్ట్ర అబ్జర్వర్‌ రమణారావు సోమవారం సందర్శించారు. అనంతరం ప్రిన్సిపాల్‌, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల సంఖ్య పెంచాలన్నారు. డ్రాప్‌ ఔట్‌ని తగ్గించేలా సూచనలు అందించారు. జిల్లా ఇంటర్‌ విద్యాధికారి శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ శరత్‌కుమార్‌, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

స్థానిక సమరానికి బీజేపీ సై
1
1/3

స్థానిక సమరానికి బీజేపీ సై

స్థానిక సమరానికి బీజేపీ సై
2
2/3

స్థానిక సమరానికి బీజేపీ సై

స్థానిక సమరానికి బీజేపీ సై
3
3/3

స్థానిక సమరానికి బీజేపీ సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement