
శ్రమిస్తేనే సత్ఫలితాలు
● సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్
వేములవాడ: శ్రమిస్తేనే సత్ఫలితాలు సాధించవచ్చని, వేములవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్ సంకెపల్లి జాహ్నవి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికవడం గర్వకారణమని సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్ అభిప్రాయపడ్డారు. సోమవారం బార్ అసోసియేషన్‌లో ఆధ్వర్యంలో జరిగిన అభినందన కార్యక్రమంలో మాట్లాడారు. న్యాయవాదులు ఎలాంటి సందేహాలు, సలహాలు అవసరమైనా స్వేచ్ఛగా న్యాయమూర్తులను సంప్రదించవచ్చన్నారు. జాహ్నవిని ఆదర్శంగా తీసుకుని, మరిన్ని న్యాయశాఖ పోస్టులు పీపీ (ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్), జడ్జిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా కష్టపడిన జాహ్నవి శ్రమకు ఫలితంగా వచ్చిన విజయమిదని పేర్కొన్నారు. జాహ్నవి తండ్రి హరికిషన్, ఏజీపీ బొడ్డు ప్రశాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండా రవి, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు కటకం జనార్ధన్, జాయింట్ సెక్రటరీ సంపత్‌గౌడ్, క్రీడల కార్యదర్శి గుజ్జ మనోహర్, గ్రంథాలయ కార్యదర్శి పంపరి శంకర్, కోశాధికారి బొజ్జ మహేందర్, మహిళా ప్రతినిధి జక్కుల పద్మ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
వేములవాడలోనే డిగ్రీ వరకు చదివా..
అమ్మానాన్న ప్రోత్సాహంతో వేములవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ స్కూల్‌లో 1 నుంచి డిగ్రీ వరకు చదివానని జాహ్నవి తెలిపారు. ఆంధ్రమహిళా సభలో ఎల్‌ఎల్‌బీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసినట్లు చెప్పారు. కోచింగ్ లేకుండా ఇంటివద్దే ప్రిపేరై నాల్గో ప్రయత్నంలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై నట్లు వివరించారు. అందరి సహకారంతో ముందుకెళ్తానని, ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా కృషి చేస్తానన్నారు.