
సెలవు ప్రకటించాలి
ఏటా జూలై రెండో మంగళవారం శీత్లా పండుగ జరుపుకుంటాం. అమ్మవారలకు సంప్రదాయ వేశధారణలో మొక్కులు చెల్లించుకుంటాం. శీత్లాభవాని వేడుకలకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరుతున్నాం. – గుగులోత్ కళావతి,
మాజీ జెడ్పీటీసీ, వీర్నపల్లి
రాష్ట్ర పండుగగా గుర్తించాలి
శీత్లాభవాని పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి బడ్జెట్ కేటాయించాలి. గోర్ బంజారాల పండుగలను గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం గుర్తించాలి.
– గూగులోత్ రవిలాల్‌నాయక్, మద్దిమల్ల
ఒకే రోజు జరుపుకోవాలని..
జిల్లాలోని అన్ని మండలాల్లో గల తండాల్లో ఒకే రోజు శీత్లా భవాని వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాం. గతంలో రెండు వారాల పాటు పండుగను జరుపుకునేవారు. ఈసారి ఈనెల 8న అన్ని తండాల్లో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని సూచించాం.
– గుగులోతు సురేశ్‌నాయక్,
బంజారాసేవా సంఘం జిల్లా అధ్యక్షులు

సెలవు ప్రకటించాలి

సెలవు ప్రకటించాలి