
బురద.. గుంతలు
తరలివచ్చి.. అర్జీలిచ్చి
బెల్ అవుతుంది కాని..: మధ్యాహ్నం కొడుక్కు లంచ్ తినిపిస్తూ..
అమ్మే.. ఆది గురువు!
నాన్నా..లే. స్కూలుకు టైం అవుతోంది. త్వరగా రెడీ కావాలంటూ.. దుప్పట్లోంచి పిల్లల్ని భుజాలపై ఎత్తుకెళ్లి బ్రష్ చేయించి.. స్నానం పోస్తోంది. స్కూల్ యూనిఫాం తొడిగి.. టిఫిన్ తినిపించి లంచ్‌బాక్స్, బుక్స్‌ను బ్యాగులో సర్దుతుంది. గేటు బయటివరకూ తీసుకెళ్లి బడికి పంపిస్తుంది. పిల్ల లు సాయంత్రం వచ్చేసరికి స్నాక్స్ సిద్ధం చేస్తుంది. వారు ఆడుకుంటుంటే స్నేహితురాలిగా.. హోంవర్క్‌లో టీచర్‌గా మారుతుంది. వారు సతాయిస్తున్నా.. సముదాయిస్తూ హోంవర్క్ పూర్తి చేయిస్తుంది. అలసిపోయిన పిల్లలకు మళ్లీ అన్నం తినిపించి గుండెలపై పడుకోబెట్టుకొని నిద్రపోతుంది. పిల్లలను స్కూలుకు పంపించడం అంత సులువేం కాదు. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు చకాచకా వారిని సిద్ధం చేస్తేనే సమయానికి పాఠశాలకు వెళ్తారు. తల్లులకు వేకువజామున మేల్కొనడంతోనే పనులు మొదలవుతాయి. చివరకు బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఏయే పరుసలతో పిలవాలో.. పిల్లలకు ముందుగా వచ్చిరాని మాటల నుంచి మొదలుకొని సంస్కారవంతమైన అలవాట్లను నేర్పించడంలో తల్లి పాత్ర కీలకం.
– సాక్షిఫొటోగ్రాఫర్
పెద్దపల్లి
సిరిసిల్లఅర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లాలోని నలుమూలల నుంచి అర్జీ దారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. సోమవా రం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డీఆర్‌డీవో శేషాద్రి అర్జీలు స్వీకరించారు. మొత్తం 151 దరఖాస్తులు రాగా, సమస్యలను పరిశీలిస్తూ పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అ నంతరం కలెక్టర్ మాట్లాడుతూ, సమస్యల పరి ష్కారానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.
సిరిసిల్ల ప్రొఫైల్:
వార్డులు 39
పట్టణ జనాభా 1,16,938
పట్టణంలో రోడ్లు 276.91 కి.మీ
బీటీ రోడ్లు 40.93 కి.మీ
సీసీ రోడ్లు 137.44 కి.మీ
మట్టి రోడ్లు 26 కి.మీ
‘ఇది ఇందిరానగర్ నుంచి తారకరామనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి. చిన్నపాటి వర్షం పడిందంటే అడుగుతీసి అడుగేయలేని ‘దారి’ద్య్రం. స్మార్ట్ సిరిసిల్లకు కలంకంగా ఉంటున్న ఈరోడ్డు అభివృద్ధికి ఐదేళ్లుగా మోక్షం కలగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వానాకాలంలో ఈదారిన వెళ్లే పాదచారులు, వాహనదారులు జర్రున జారిపడుతున్నారు’.
బిల్లులు ఇప్పించాలి
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో డబుల్‌బెడ్రూం మంజూరయింది. అప్పుడు ఇల్లు కట్టుకోండి బిల్లులు మంజూరు చేస్తామని చెప్పారు. రూ.10 లక్షల వరకు ఖర్చుచేసి ఇల్లు కట్టుకోగా, అప్పులు అయ్యాయి. ఇస్తానన్న రూ.5 లక్షలు మంజూరు చేయించాలి.
– ప్యారం సత్తవ్వ, ఆవునూరు, ముస్తాబాద్
ఉపాధి కల్పించాలి
రెండేళ్ల నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న. వైద్యం కోసం భూమి, ఆస్తిపాస్తులు అమ్ముకున్నాం. చేతిలో చిల్లి గవ్వకూడా లేదు. ప్రభుత్వం ఆర్థికసాయం చేసి, ఉపాధి కల్పించి ఆదుకోవాలి.
– నీరుక లత, దుమాల, ఎల్లారెడ్డిపేట
‘ఇది జిల్లా కేంద్రంలోని శాంతినగర్– శ్రీనగర్ వెళ్లే ప్రధాన రోడ్డు. 50 ఫీట్ల రోడ్డు పనులు పూర్తికాక ఏళ్లు అవుతోంది. చంద్రంపేట ప్రధాన రోడ్డును కలిపే లింకురోడ్డు. నిత్యం వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించే ఈ దారిని సీసీగా మార్చాలన్న ప్రజాకాంక్షను గతంలో పాలకులు, ఇప్పుడు అధికారులు పట్టించుకోవడం లేదు’.
ఇది పట్టణంలోని సాయినగర్ నుంచి మార్కట్‌పల్లికి వెళ్లే ప్రధాన లింకురోడ్డు. సమీపంలోని ఇందిరాపార్కుకు నిత్యం వందల సంఖ్యలో సందర్శకులు వచ్చే దారి. గతంలో రోడ్డు మరమ్మతుకు నిధులు కేటాయించినా పనులు ప్రారంభం కాలేదు. నడిచేవారికి నరకంగా, వాహనదారులకు ప్రాణ సంకటంగా ఉన్న ఈదారిని ప్రత్యేక పాలనలో అయినా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజావాణికి 151 దరఖాస్తులు
స్వీకరించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు

బురద.. గుంతలు