
ఖాళీ అయిన ధాన్యం రాశి
కొనుగోలు కేంద్రంలో ధాన్యం అపహరణ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం కిషన్‌దాస్‌పేటలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వచేసిన ధాన్యాన్ని దొంగలు శుక్రవారం రాత్రి ఎత్తుకెళ్లారు. మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చాడు. తేమశాతం రావడానికి నిత్యం ధాన్యాన్ని ఆరబెడుతున్నాడు. రాత్రి పూట కుప్పగా పోసి ఇంటికి వెళ్లి శనివారం ఉదయం వచ్చి చూసే సరికి ధాన్యం ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే కేంద్రాలలో రైతుల ధాన్యం తూకం వేయడానికి బీహర్ నుంచి వచ్చిన పలువురి హమాలీల సెల్‌ఫోన్‌లను దొంగలు అపహరించుకుపోయారు. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.