
● ముస్తాబైన వేములవాడ క్షేత్రం ● నేడు నిత్య కల్యాణాలు రద్దు
వేములవాడ: ఈనెల 18 నుంచి 26వ తేదీ వరకు వినాయకచవితి సందర్భంగా నాగిరెడ్డి మంటపంలో గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈమేరకు నాగిరెడ్డి మండపంలో ఏర్పాట్లు చేశారు. 18న ఉదయం 9.15 గంటలకు పుణ్యహవచనం, అఖండ దీపారాదన, సిద్ధి బుద్ధి వినాయక ప్రతిష్ఠ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. వినాయక చవితి రోజున సాయంత్రం 4 గంటలకు శమంతకోపాఖ్యానం నిర్వహిస్తారు. ఈనెల 26న రాత్రి 7.10 గంటల నుంచి పెద్దసేవ ఊరేగింపు అనంతరం గణేశ్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. వినాయక చవితి రోజు నిత్య కళ్యాణం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.