ఉలవపాడు: కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై ఉలవపాడు బైపాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. చైన్నె నుంచి కోల్‌కతాకు కొబ్బరికాయల లోడుతో డ్రైవర్ రామచంద్రన్, క్లీనర్ గంగాధర్ బయలుదేరారు. ఉలవపాడు బైపాస్ వద్దకు రాగానే కుక్క అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేయగా లారీ అదుపు తప్పి బోల్తాపడింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


