ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

ఒంగోలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలపై డీఈవో రేణుకను బుధవారం యూటీఎఫ్‌ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఉపాధ్యాయుల స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఎన్‌ఓసీలు, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, బీఈడీ కోర్సులు చేసిన ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డీఈఓ రేణుక సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెడ్మాస్టర్‌ సూరె వేణుగోపాల్‌, పోతంశెట్టి రమాదేవి ప్రమోషన్‌ డేటును నోషనల్‌ సీనియార్టీ కింద లెక్కించేందుకు త్వరలోనే ప్రొసీడింగ్‌ ఇస్తామని తెలిపారన్నారు. ఉపాధ్యాయుల పాస్పోర్ట్‌, వీసా ఎన్‌ఓసీల గురించి అడిగినప్పుడు వెంటనే క్లియర్‌ చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల జెడ్పీ పీఎఫ్‌ సమస్యల మీద జెడ్పీ డిప్యూటీ సీఈఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.రవి, జిల్లా అధ్యక్షుడు కిలారి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌హై, సహాధ్యక్షుడు వై.వెంకట్రావు, జిల్లా కోశాధికారి చిన్న స్వామి, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యుడు కొప్పోలు హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement