భూముల్లో ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న బద్ధిపూడి గ్రామానికి చెందిన ఎస్సీలు తవ్వకాలను అడ్డుకొని నిలిపివేశారు. అయితే రెండు రోజుల నుంచి వారు తవ్వకాలను నిలిపివేయడం వారు వెళ్లగానే తవ్వకాలు చేపట్టడం పరిపాటిగా మారింది. దీంతో సోమవారం భూములకు సంబందించిన వారంతా భూముల వద్దకు వచ్చి వారి భూముల్లో వేసి రోడ్డును జేసీబీతో తొలగించారు. మా భూములను ఆక్రమించుకొని శ్రీరంగరాజపురంకు చెందిన ఓ రైతు జామాయిల్ మొక్కలు కూడా వేశారు. ఆ మొక్కలను కూడా తొలగించాలని రైతులు డిమాండ్ చేశారు. తవ్వకాలు చేపడితే ఊరుకునేది లేదని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్ మురళిని వివరణ కోరగా..ఇసుక తవ్వకాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని, దీనిపై విచారిస్తున్నట్లు తెలిపారు. దీనిపై గ్రామాల సరిహద్దుల వద్ద కూడా సమస్య ఉందని, పూర్విగా సర్వే చేయించి హద్దు వేయిస్తామని చెప్పారు.


