● రూ.9 లక్షల విలువైన బంగారం, వెండి అపహరణ
సింగరాయకొండ: మండల కేంద్రంలోని జీవీఆర్ రోడ్డులో ఉన్న సిటికేబుల్ కార్యాలయం బిల్డింగ్ మొదటి అంతస్తులో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితుడు కథనం ప్రకారం..మొదటి అంతస్తులో నివసిస్తున్న విర్రు చెంచయ్య, అతని భార్య లలితమ్మలు గుడివాలోని కుమార్తె ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఆదివారం ఉదయం చూసేసరికి ఇంటి తాళం తీసి ఉండటంతో పాటు బీరువాలోని లాకర్ ధ్వంసం చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు 8 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీ చేసినట్లు గుర్తించారు. క్లూస్ టీం బృందం వేలిముద్రలు సేకరించారు.
లలితమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


