వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రానికి అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు. | - | Sakshi
Sakshi News home page

వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రానికి అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు.

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రానికి అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో జల్లులు పడవచ్చు. ఉపాధ్యాయినుల సమస్యలు పరిష్కరించాలి ● యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు

ఒంగోలు సిటీ: రాష్ట్రంలో 50 శాతం మహిళా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు కోరారు. యూటీఎఫ్‌ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం ప్రకాశం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ హై ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మంత్రులు నారా లోకేష్‌, గుమ్మడి సంధ్య రాణి, వంగలపూడి అనిత లకు మెమొరాండం ఇస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల్లో 50 శాతం మహిళా ఉపాధ్యాయులే పనిచేస్తున్నారని వారికి పని చేసే పాఠశాలలో అనేక చోట్ల స్టాఫ్‌ రూమ్స్‌, టాయిలెట్లు వంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. లైంగిక వేధింపులు, భద్రతా సమస్యలను నిత్యం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి మహిళా ఉపాధ్యాయుల సంతకాల సేకరణ అనంతరం ఈ మెమోరాండంలను రాష్ట్ర సంఘానికి పంపిస్తారన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ రవి మాట్లాడుతూ మహిళా టీచర్ల భద్రత కోసం ఒక ప్రొటెక్షన్‌ సెల్‌ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలని, మహిళలు పనిచేసే పాఠశాలలో ప్రశ్నపత్రాలు, పుస్తకాలు తీసుకురావడం, రైస్‌ ఇండెంట్‌ ఇవ్వడం తదితర పనుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఒత్తిడి తగ్గించేందుకు ప్రతి హైస్కూల్లో ఒక స్ట్రెస్‌ మేనేజ్మెంట్‌ కౌన్సిలర్‌ ను ఏర్పాటు చేయాలని, పిల్లల అనారోగ్యం, చదువు నిమిత్తమే కాకుండా పెళ్లి అయిన బిడ్డలకు తీవ్ర అనారోగ్యం, ఆపరేషన్‌, డెలివరీ సమయాల్లో కూడా వినియోగించుకునేలా చైల్డ్‌ కేర్‌ లీవును మార్పు చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ అబ్దుల్‌ హై మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఉచిత న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం సంధ్యారాణి, ఝాన్సీ లక్ష్మీబాయి, నన్నమూరి లక్ష్మీ శివపార్వతి, జే శారద, శ్రీదేవి, షేక్‌ హాజీరా బేగం, జిల్లా సహాధ్యక్షుడు వై వెంకట్రావు, జిల్లా కోశాధికారి, ఎన్‌ చిన్న స్వామి, జిల్లా కార్యదర్శి సీహెచ్‌ ప్రభాకర్‌ రెడ్డి, శ్రీనివాసరావు, ప్రభాకర్‌ రెడ్డి, జీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement