దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణ | - | Sakshi
Sakshi News home page

దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణ

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణ

దర్శి: దర్శి డీఎస్పీగా బాలమురళీకృష్ణ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ బదిలీపై వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన బాలమురళీకృష్ణ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక ప్రణాళికలతో పనిచేసి తమ డివిజన్‌ పరిధిలో పోలీసు శాఖకు మంచి పేరు తీసుకొస్తానన్నారు. దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పట్టణంలో సీసీ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. నేరాల నియంత్రణ, అక్రమాల కట్టడికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. డివిజన్‌ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైలు డీఎస్పీని కలిసి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement