మృతుల కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

మృతుల కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ ఆర్థిక సాయం

Apr 10 2026 9:45 AM | Updated on Apr 10 2026 9:45 AM

కొనకనమిట్ల: బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన పెదారికట్ల ఎస్సీ కాలనీకి చెందిన తండ్రి, కుమారుడు అంబటి అనిల్‌, లియో కుటుంబానికి గురువారం సాయంత్రం వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, ఉడుముల శ్రీనివాసులరెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు అన్నా, ఉడుముల పార్టీ నాయకులతో కలిసి పెదారికట్ల ఎస్సీ కాలనీకి వెళ్లి అనిల్‌ భార్య సౌజన్య, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌజన్యకు, ఇతర కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదం చోటు చేసుకున్న రోజున మృతుల కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని పార్టీ ప్రకటించిందని, ఆ మేరకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేసినట్లు అన్నా, ఉడుముల తెలిపారు. అనుకున్నమేర ఆర్థిక సాయం అందజేసినందుకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ యాదవ్‌, జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఉడుముల గురవారెడ్డి, మారావత్‌ వెంకటేశ్వర్లు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు.

రూ.2 లక్షల నగదు అందజేసిన

మాజీ మ్మెల్యేలు అన్నా, ఉడుముల

Advertisement
 
Advertisement
Advertisement