మార్కాపురం: రాజధాని అమరావతి పేరుతో ప్రజలను మఽభ్యపెట్టే చర్యలు, సంబరాలు మానుకుని, ముందు రాజధానిని నిర్మించి చూపాలని చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ నెల్లూరు పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. శ్రీరాజధాని కట్టేస్తున్నాం, ప్రపంచం అదిరేలా చేస్తున్నాంశ్రీ అని 2014 నుంచి గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న చంద్రబాబు సర్కారు ఇప్పటికీ ఏపీ కేపిటల్ అమరావతి పేరుతో సంబరాలు చేస్తున్నారని, అయితే రాజదానికి ఇంతవరకు అతీగతీ లేదన్నారు. ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించేలా కేంద్రం నుంచి నాడే ఎందుకు అనుమతి తీసుకురాలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదించడం సంగతి అటుంచితే, ఇన్నాళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేసిన అన్యాయాన్ని విస్మరించి మోడీ సర్కార్‌కు ఎలా జైకొట్టారని నిలదీశారు. మళ్లీ ఇప్పుడేదో గొప్పగా సాధించినట్లు చంద్రబాబు ప్రభుత్వం జబ్బలు చరుచుకోవడం అవివేకమని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో బాబు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆలోచన కలిగిన వారని, అమరావతి పేరుతో చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాన్ని నిలదీసే రోజు దగ్గరలోనే ఉందని జంకె హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి


