కంభం నియోజకవర్గంగా ఉన్న సమయంలో కూడా నాటి పాలకులు ఈ ప్రాంత కక్షిదారుల అవసరాలను గుర్తించక పోవడం, సమస్యలను ఉన్నతస్థాయి కోర్టులు, జడ్జిల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో కోర్టు ఏర్పాటుకు నోచుకోలేదు. కోర్టు ఏర్పాటుకు అవసరమైన వసతులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడంతో మూడు మండలాల ప్రజలు దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు.
– ఉదయగిరి మల్లికార్జున,అడ్వకేట్, కంభం
కంభంలో కోర్టు ఏర్పాటు చేయాలి
గతంలో కంభంలో ఉన్న కోర్టును కొన్ని అనివార్య కారణాల వల్ల నాడు గిద్దలూరుకు తరలించారు. కోర్టు ఏర్పాటు కోసం పలుమార్లు ధర్నాలు చేశాం. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించాం. రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించి కోర్టు ఏర్పాటు ఆవశ్యకతపై గళం వినిపించాం. కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాల్లో సివిల్ కేసులు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి కంభంలో కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.
– మహమ్మద్ ఇబ్రహీం, ఎస్‌జీపీఏ ఏపీ అధ్యక్షుడు, కంభం


