ఆర్థికసాయం | - | Sakshi
Sakshi News home page

ఆర్థికసాయం

Apr 5 2026 9:12 AM | Updated on Apr 5 2026 9:12 AM

బస్సు ప్రమాద మృతునికి

వెలిగండ్ల,(కనిగిరిరూరల్‌): మార్కాపురంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వెలిగండ్ల మండలం చౌడవరం గ్రామానికి చెందిన పొదిలి మహేంద్ర కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ కనిగిరి ఇన్‌చార్జి దద్దాల నారాయణ రూ.లక్ష ఆర్థికసాయాన్ని అందజేశారు. వైఎస్సార్‌ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచనల మేరకు పార్టీ నాయకులతో కలిసి శనివారం మహేంద్ర భార్య నాగమణి, కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన చౌడవరంకు చెందిన క్షతగాత్రులు కుమ్మరికుంట అబ్రహ్మం, రామచంద్రపు ప్రవీణ్‌లను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో జెడ్పీటీసీ గుంటక తిరుపతిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల వెంకటరెడ్డి, ఎలికా నారాయణ, కటికల వెంకటరత్నం, మేడం ఆదినారాయణ, బోబ్బారెడ్డి వెంకటరెడ్డి, పొల్లా సుబ్రహ్మణ్యం, కుప్పనబోయిన వెంకట రామయ్య, నారపరెడ్డి కోటిరెడ్డి, సానా భాస్కర్‌రెడ్డి, డి. రంగారెడ్డి, బాల నారాయణ, జి.రాజు, నారాయణరెడ్డి, జి.బాలిరెడ్డి, డి.గురుబ్రహ్మయ్య, జి.బెంజీమన్‌, కె.పుల్లయ్య, ఎలికా రమణయ్య, కె.ఆదాం, గాలిమోటు రోశయ్య, రాజీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement