ఆడబిడ్డ నిధి హామీ ఏమైంది బాబు
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ నేతలు ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పన ఏడాదికి రూ.18 వేలు ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఇప్పటి వరకు దాని ఊసే లేదు. అధికారం కోసం మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోని, అధికారంలోకి వచ్చిన తరువాత హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో మహిళలు తమ సత్తా చూపిస్తాం.
– ఉడుముల వరలక్ష్మి, వైఎస్సార్ సీపీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శి, పొదిలి
ఆడబిడ్డ నిధి హామీ ఏమైంది బాబు


