శ్రీశైలం ఘాట్‌లో ఒరిగిన బస్సు
పెద్దదోర్నాల: వేగంగా వెళుతూ అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కనే ఉన్న మార్జిన్ గుంతలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శ్రీశైలం ఘాట్ రోడ్డులోని చింతల గిరిజన గూడెం సమీపంలో సోమవారం జరిగింది. ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏఎస్సై పోలురాజు కథనం మేరకు..శ్రీశైల పుణ్యక్షేత్రంలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న యాత్రికులు బస్సులో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో చింతల వద్దకు వచ్చేసరికి బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మార్జిన్ గుంతలోని దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. మార్జిన్‌లో దూసుకెళ్లి గంతలోకి దిగిన బస్సు పక్కనే ఉన్న కొండను ఆనుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ఎడమ వైపు పూర్తిగా కొండను ఆనుకోవడంతో కిటికీల వద్ద కూర్చున్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకుండా తృటిలో తప్పించుకున్నారు. ప్రమాద సమయంలో బస్సులోని ప్రయాణికులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురికావడంతో సంఘటనా స్థలిలో కొంత మేర గందరగోళ వాతావరణం నెలకొంది. అటుగా వెళుతున్న ప్రయాణికులు వెంటనే యత్రికులను సురక్షితంగా బయటకు తీశారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలోకి
దూసుకెళ్లిన వైనం
సురక్షితంగా బయటపడిన
62 మంది ప్రయాణికులు
శ్రీశైలం ఘాట్‌లో ఒరిగిన బస్సు


