ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల అరెస్టు
కనిగిరిరూరల్: ట్రాన్స్‌ఫారాలను పగులగొట్టి అందులోని రాగి వైరును అపహరిస్తున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని కనిగిరి, హెచ్‌ఎంపాడు, సీఎస్‌పురం మండలాల్లో ట్రాన్స్‌ఫారాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పాతూరుకు చెందిన నాగులూరి అంకబాబు, నాగులూరి దుర్గా ప్రసాద్, సీఎస్‌రానికి చెందిన నల్లగట్ల వెంకట నారాయణలు ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి వైర్లను అపహరించారు. ఈ క్రమంలో కనిగిరిలో 9, సీఎస్‌పురంలో 2, హనుమంతునిపాడులో 2 ట్రాన్స్‌ఫార్మర్లను చోరీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఫిర్యాదుల మేరకు నిందితులను గురువారం ఉదయం 11.30 గంటలకు హెచ్‌ఎంపాడు ఎస్సై కె.మాధవరావు, పోలీస్ సిబ్బంది కలిసి కనిగిరి పొదిలి రోడ్డులోని పొగాకు బోర్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను విచారించి వారి వద్ద నుంచి 13 ట్రాన్స్‌ఫార్మర్లకు చెందిన 155 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కేసు రికవరీ చేసిన హెచ్‌ఎం పాడు ఎస్సై కె.మాధవరావును, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ ఉప్పు శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.
155 కేజీల రాగి వైరు స్వాధీనం
వివరాలు వెల్లడించిన
డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్


