శతాబ్దాల నాటి చెరువు కావాలి ఆదరువు..
చెరువుకట్ట రోడ్డును అభివృద్ధి చేయాలి
మార్కాపురం చెరువుతో పాటు చెరువుకట్ట రోడ్డును కూడా ప్రభుత్వం త్వరగా పూర్తిచేయాలి. చెరువుకట్టను ట్యాంకుబండ్‌లాగా మార్చాలి. చెరువుకట్టకు రెండు వైపులా లైటింగ్ వేయాలి. ప్రజలు కూర్చునేందుకు బెంచీలను ఏర్పాటు చేయాలి. చెరువులో నీరు వృథా పోకుండా చూడాలి. ఎస్‌ఎస్ ట్యాంకు నిర్మిస్తే వేసవిలో నీటి సమస్య లేకుండా ఉంటుంది. అధికారులు ఆ దిశగా కృషిచేయాలి.
– ఉస్మాన్, వైఎస్సార్ సీపీ 12వ బ్లాక్ ఇన్‌చార్జి, మార్కాపురం
సాగర్‌నీటికి ఇబ్బంది లేకుండా చూడాలి
పట్టణంలో ఎక్కువగా సాగర్ నీరు అవసరం. సాగర్ నీటిలో పైపులైన్లు పగిలిపోయినప్పుడు సుమారు వారం రోజుల పైన నీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీప్ బోర్ల ద్వారా కొన్ని ప్రాంతాల వారికి నీరు వస్తున్నా ఎక్కువమంది ప్రజలు సాగర్‌నీటిపై ఆధారపడి ఉన్నారు. రెండో ఎస్‌ఎస్ ట్యాంకు ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు సాగర్‌నీటి కష్టాలు తగ్గుతాయి.
– బి.బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ యూత్ పట్టణ అధ్యక్షుడు
మార్కాపురం టౌన్: వందల ఏళ్ల చరిత్ర కలిగిన మార్కాపురం చెరువు అభివృద్ధిపై సర్వత్రా చర్చ సాగుతోంది. శ్రీకృష్ణ దేవరాయుల పాలన కంటే ముందుగా సుమారు 600 ఏళ్ల క్రితం ఈ చెరువు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇటీవల జిల్లాగా మారిన మార్కాపురం పట్టణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద చెరువును 15వ శతాబ్ధంలో నిర్మించారు. సుమారు 590 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీనికింద ఆయకట్టు 1100 ఎకరాలు కాగా, అనధికారికంగా మరో 2,500 ఎకరాలు ఉంది. మార్కాపురం పట్టణంలో భూగర్భజలాలు ఉండాలి ఉంటే ఈ చెరువులో నీరే ఆధారం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మార్కాపురం చెరువు అభివృద్ధికి నోచుకోలేదు. గత కొన్నేళ్ల క్రితం వర్షాభావ పరిస్థితుల్లో చెరువు ఎండిపోవడంతో వ్యవసాయం సాగక చెరువు ఆయకట్టు కింద భూములు బీడు భూములుగా మారాయి. కొనే్‌ున్ళ్ల వర్షాభావ పరిస్థితుల్లో కొంతమంది రైతులు మాత్రమే జొన్న, సజ్జ, చిరుధాన్యాలను సాగుచేసుకుని జీవనం సాగించారు. అయితే ఆ పంటలను సాగుచేసే రైతులు కూడా కరువవడంతో భూములు బీడు భూములుగా మారాయి.
నిధులు మంజూరైనా
ప్రారంభం కాని పనులు..
మార్కాపురం చెరువుకట్ట రోడ్డును అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.10 కోట్లను మంజూరుచేశారు. అయితే టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చెరువుకట్ట అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చెరువుకట్టను అభివృద్ధి చేస్తే వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా ఉంటుంది. చెరువుకట్టను ట్యాంకుబండ్‌గా మారిస్తే వాకర్లకు, సేద తీరేందుకు పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.
ఎస్‌ఎస్‌ట్యాంకుగా మారిస్తే
తీరనున్న నీటి సమస్య..
ప్రస్తుతం మార్కాపురం పట్టణంలో సుమారు లక్షకు మించి జనాభా ఉంది. 35 వార్డుల్లో సాగర్ పైప్‌లైన్లతో నీటిని ఏర్పాటుచేశారు. సాగర్ పైపులైన్లు, పది లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులు నాలుగు, 4.50 లక్షల కెపాసిటీ ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకులు రెండు ఉన్నాయి. పట్టణంలోని సుమారు 13 నుంచి 14 వేల సాగర్‌వాటర్ కనెక్షన్లు గృహాలు ఉన్నాయి. రోజుకు సాధారణ మనిషికి సుమారు 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఇప్పటివరకూ గతంలో నాలుగు రోజులకు ఒకసారి సాగర్‌నీరు అందిస్తున్నారు. ఇటీవల దూపాడు వద్ద మరో మోటార్ ఏర్పాటు చేయడంతో మూడు రోజులకొకసారి సాగర్‌నీటిని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సాగర్ పైపులైన్లు పగిలిపోయిన, ఎస్‌ఎస్ ట్యాంకు వద్ద మోటార్లు మరమ్మతులకు గురైనా వారంరోజుల పాటు నీటికి పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురికాక తప్పడం లేదు. ప్రస్తుతం మార్కాపురం పురపాలక సంఘ పరిధిలోని ప్రజలకు దూపాడు వద్ద ఉన్న 2200 మిలియన్ లీటర్ల కెపాసిటీ ఎస్‌ఎస్‌ట్యాంకు మాత్రమే ఉంది. అయితే పట్టణ ప్రజలకు అవసరమైన సాగర్‌నీటిని ప్రతి రోజూ అందించాలంటే మరో ఎస్‌ఎస్‌ట్యాంకు ఏర్పాటుచేస్తేనే సాధ్యమవుతుంది. 2.0లో భాగంగా 62 కోట్ల రూపాయలతో మరో ఎస్‌ఎస్‌ట్యాంకును ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనను టెండర్ల స్థాయిలో ఉన్నట్లు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. మార్కాపురం చెరువును దూపాడు సాగర్ నీటితో ఎస్‌ఎస్‌ట్యాంకుగా మారిస్తే పట్టణ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారమవుతుంది.
సాగర్ కాలువ
దూపాడు వద్ద ఉన్న ఎస్‌ఎస్‌ట్యాంకు
వందల ఏళ్ల చరిత్ర కలిగిన మార్కాపురం చెరువు
చెరువు ఆయకట్టు పరిధిలో వేల ఎకరాల భూమి
ఎస్‌ఎస్‌ట్యాంకుగా మారిస్తే తీరనున్న తాగునీటి సమస్య
చెరువుకట్ట రోడ్డును ట్యాంకుబండ్‌గా మార్చాలని విజ్ఞప్తి
చెరువు అభివృద్ధిని పట్టించుకోని బాబు సర్కార్
శతాబ్దాల నాటి చెరువు కావాలి ఆదరువు..
శతాబ్దాల నాటి చెరువు కావాలి ఆదరువు..
శతాబ్దాల నాటి చెరువు కావాలి ఆదరువు..
శతాబ్దాల నాటి చెరువు కావాలి ఆదరువు..


