సమష్టిగా ముందుకు సాగుదాం
కనిగిరిరూరల్: ‘సమష్టిగా పనిచేద్దాం, కనిగిరిలో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురేద్దాం.. 2029లో మళ్లీ జగనన్నను సీఎం చేసుకుందాం’ అని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణయాదవ్ అన్నారు. వైఎస్సార్ సీపీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పార్టీ కమిటీల ఏర్పాటుపై మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విసృత స్థాయి సమావేశం మున్సిపల్ చైర్మన్ ఎస్‌కే అబ్దుల్ గఫార్ అధ్యక్షతన నిర్వహిచంచారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఐక్యతగా, ప్రణాళికాబద్ధంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అబద్ధల హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ 18 నెలల కాలంలోనే పూర్తిగా విఫలమైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ వైఖరిపై ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ బాబులు క్రెడిట్ చోరీ రాజకీయాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాన్నారు. పార్టీకి కార్యకర్తలే కీలకమని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రణాళికాబద్ధంగా పనిచేసి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు.
పార్టీ కోసం పనిచేసే వారికి
సముచిస్థానం
రానున్న రోజులు వైఎస్సార్ సీపీవేనని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో తగిన గుర్తింపు, సముచిత స్థానం దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పరిశీలకుడు కసుకుర్తి ఆదెన్న అన్నారు. రాష్ట్రంలో ప్రజా కంఠక పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనను క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 10 లోపు గ్రామ కమిటీలను పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ, అన్ని విభాగాల అనుబంధ కమిటీల ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జెడ్పీటీసీ మడతల కస్తూరిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సాల్మన్ రాజు, మాజీ ఎంపీపీ భువనగిరి వెంకటయ్య, పార్టీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పులి శాంతి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు యక్కంటి శ్రీనివాసులరెడ్డి, జి.బొర్రారెడ్డి, రాచపుడి మాణిక్యరావు, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, డాక్టర్ ఎస్‌కే రసూల్, ఆయిమల్ల నాగమణి, గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, ఓమెగా రామిరెడ్డి, గట్లా విజయభాస్కర్‌రెడ్డి, కటికల వెంకటరత్నం, శ్రీరాం సతీష్, పోలక సిద్ధారెడ్డి, గురు ప్రసాద్, గుంటగాని అభి, శ్యామల సాంబిరెడ్డి, ఎస్‌కే గయాజ్, ఎస్‌కే బుజ్జీ, సిరుప వెంకట గోవర్ధన్‌రెడ్డి, భవనం కృష్ణారెడ్డి, రామనబోయిన శ్రీనివాసుల యాదవ్,మితికల గురవయ్య, ఎస్‌కే ఖాజా మొహిద్దీన్, ఎస్‌కే ఖాశింవలి, ఎస్‌కే జిలాని, మీరావలి, సానికొమ్ము మధు, తాతపుడి నాని, తాతపుడి సురేష్, గోనా శ్యాంసన్, కసిరెడ్డి రామసుబ్బారెడ్డి, గాలి నాగేశ్వరరావు, పులి శ్రీను, ఎస్‌కే రహీం, కుప్పన బోయిన రమణయ్య, ఎలికా నారాయణ, పరిమి వెంకట్రావ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకే పార్టీకి సైనికులు
పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం
పాలనలో బాబు ప్రభుత్వం విఫలం
వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ
సమష్టిగా ముందుకు సాగుదాం


