డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
నాగులుప్పలపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు, పోలీసులు వివరాల మేరకు.. ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన పైనం రమేష్‌బాబు (43) ఒంగోలులో నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నిద్రమత్తులో చదలవాడ పశుక్షేత్రం సమీపంలో డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పామూరు: గన్నేరు కాయలు తిని మహిళ మృతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పామూరులోని శివాలయం సమీపంలో మంగళవారం జరిగింది. ఏఎస్సై జిలానీబాష తెలిపిన వివరాలు... శివాలయం సమీపంలో కోమటిగుంట్ల రాధ అనే మహిళ పిల్లలతో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. గత రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంది. కాగా మంగళవారం మనస్తాపానికి గురైన రాధ స్థానిక శివాలయంలోని గన్నేరు కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురైంది. బంధువులు ఆమెను స్థానిక సీహెచ్‌సీకి తరలించి గన్నేరుపప్పు కక్కించారు. మెరుగైన వైద్యంకోసం మరో వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఏఎస్సై జిలానీబాష వివరాలు సేకరిస్తున్నారు.
కంభం: కంభం చెరువులో గల్‌లైంతన వ్యక్తి కోసం మూడు రోజులుగా బోటులో గాలిస్తున్నా ఆచూకి లభ్యం కాలేదు. మంగళవారం చీకటి పడే వరకు జాలరులు బోటులో లంగరు సహాయంతో చెరువులో గాలించినా ఆచూకీ దొరకలేదు. చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండటం, చెరువు లోపల పెద్ద పెద్ద చిల్లచెట్లు పెరిగి ఉండటం వల్ల వెతకడం కష్టతరంగా మారుతోంది. ఆదివారం నుంచి కందులాపురం పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి కనిపించకుండా వెళ్లిన నేపథ్యంలో ఆ వ్యక్తే చెరువులో పడ్డాడా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టి చెరువు కట్ట సమీపంలో రైల్వే గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. కనిపించకుండా వెళ్లిన వ్యక్తికి సంబంధించిన వారు సైతం కంభం చెరువు కట్టకు వద్దకు చేరుకొని ఎదురుచూస్తున్నారు.
డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి


