రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కనిగిరిరూరల్: కారు ఢీకొని యువకుడు పి. శ్రీకాంత్(26) మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కనిగిరిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం పొతవరం సమీపంలోని బాలాజీనగర్‌కు చెందిన పి.శ్రీకాంత్ పనుల నిమిత్తం కనిగిరికి వచ్చాడు. ఈ క్రమంలో కాశిరెడ్డి కాలనీ సమీపంలో బైక్ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా.. పొదిలి వైపు నుంచి కనిగిరివైపు వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో బలమైన రక్తగాయాలయ్యాయి. క్షతగాత్రుడు శ్రీకాంత్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పామూరు: దేవస్థాన భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భుజంగేశ్వరస్వామి ఆలయ ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు అన్నారు. ‘ఎమ్మెల్యే బొమ్మెడదాం దేవుడి భూమి దోచేద్దాం’ అన్న శీర్షికన శనివారం సాక్షిలో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఆక్రమణను తక్షణం తొలగించి బాద్యులపై చర్యలు తీసుకోవాలని దేవస్థాన ఈఓను ఎమ్మెల్యే ఆదేశించారు. దీనిపై తహసీల్దార్ ఆర్.వాసుదేవరావు, ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు ఆక్రమణ ప్రాంతానికి వేసిన ఫెన్సింగ్, హద్దురాళ్లను, ఎమ్మెల్యే ఫొటో ఉన్న ఫ్రేమ్‌ను తొలగించి ఫ్లాట్‌ను చదునుచేశారు. బాద్యుడైన నరసింహులుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కురిచేడు: మండలంలో కీచక గురువు వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగుచూశాయి. ఆవులమంద కొత్తూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థినుల పట్ల ఆ పాఠశాలకు అప్పుడప్పుడు డిప్యుటేషన్‌పై వచ్చే ఉపాధ్యాయుడు గొర్రెపాటి అచ్చయ్య అసభ్యంగా ప్రవర్తించిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు అచ్చయ్య తమను తాకరాని చోటతాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ వారి తల్లిదండ్రులకు విద్యార్థినులు చెప్పారు. దీంతో శుక్రవారం ఎంఈఓ వస్త్రాంనాయక్‌కు ఫోన్ చేసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, శనివారం మరో ఉపాధ్యాయుడిని ఆ పాఠశాలకు ఎంఈఓ పంపారు. అయితే, ఈ విషయాన్ని ఎంఈఓ ధ్రువీకరించకపోగా, పోలీసులకు కూడా ఎటువంటి ఫిర్యాదు అందలేదు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


