ఉచిత వైద్యం అందించడమే ధ్యేయం
60వేల సంతకాల ప్రతులు ఒంగోలుకు తరలింపు జెండా ఊపి వాహనం ప్రారంభించిన బూచేపల్లి
దర్శి: పేదలందరికీ ఉచిత వైద్యం అందించడమే వైఎస్సార్ సీపీ ధ్యేయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ స్పష్టం చేశారు. కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా దర్శి నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల ప్రతులను బుధవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ఒంగోలుకు తరలించారు. పార్టీ కార్యాలయంలో ప్రతులను ప్రదర్శించి వాహనంలో 30 బాక్సుల్లో ప్రతులను ఉంచి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మలు జెండా ఊపి వాహనాన్ని ర్యాలీగా తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, వెంకాయమ్మ మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో 60 వేల సంతకాలు పూర్తి చేసి ఆన్‌లైన్ చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల ఉద్యమానికి మద్దతు పలికారని చెప్పారు. ఈనెల 15వ తేదీన జిల్లాలో అన్నీ నియోజకవర్గాల నుంచి ఒంగోలుకు వచ్చిన ప్రతులను తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చుతారన్నారు. గ్రామంలో ఉద్యమంలా సంతకాల సేకరణ విజయవంతంగా జరిగిందని చెప్పారు. చంద్రబాబు పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రతి పేదవాడు టీడీపీకి ఓటు ఎందుకు వేశామా అని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు పేదలకు మేలు చేయాలి కానీ ఇలా తమ స్వార్థం కోసం గత పాలకులు తీసుకొచ్చిన ప్రభుత్వ ఆస్తులను దోచుకోవాలనుకోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్ జగన్‌కు మంచి పేరు రావడాన్ని టీడీపీ నేతలు, చంద్రబాబు జీర్ణించుకోలేక పేదలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో తన బినామీలకు అప్పగించి ప్రైవేటుపరం చేసి పేదలకు వెన్నుపోటు పొడిచేందుకు కుట్రలు చేస్తు్‌ాన్నరన్నారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుందా అని ప్రశ్నించారు. ఇదేనా పేదల పట్ల చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి అని మండిపడ్డారు. ఇప్పటికై నా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని పీపీపీ విధానం వెనక్కు తీసుకుని పేదలకు ఉచిత మెడికల్ విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జగనన్న ఆదేశాల మేరకు పేదల కోసం ఎందాకై నా పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.


