కాలువలో పడి యువకుడు మృతి
నాగులుప్పలపాడు: ద్విచక్రవాహనంపై వెళుతున్న యువకుడు అదుపుతప్పి రోడ్డు పక్కన కాలువలో పడటంతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..మద్దిపాడు మండలం తిమ్మనపాలెం గ్రామానికి చెందిన బోజేపల్లి కోటయ్య (32) మోటారు సైకిల్‌పై ఉప్పుగుండూరు నుంచి నాగులుప్పలపాడు వెళుతున్నాడు. ఈ క్రమంలో మధ్యలో వారాహగిరి కోల్డ్ స్టోరేజీ సమీపంలో మోటార్ సైకిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108కు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.


