కంభం చెరువుకు జలకళ
కంభం: నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుండ్లకమ్మ, జంపలేరు వాగులు ఉధృతంగా పారడంతో వరద నీరు చారిత్రక ప్రసిద్ధి చెందిన కంభం చెరువుకు వచ్చి చేరుతోంది. గతంలో కురిసిన వర్షాలకు పది అడుగుల మేర నీరు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 16 అడుగులు దాటినట్లు తెలుస్తోంది. మరో 3–4 అడుగులు నీరు చేరితే అలుగు పారే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావం ఈ నెల 29వ తేదీ వరకు ఉండటంతో ఈసారి చెరువు నిండి అలుగు పారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిండు కుండలా ఉన్న కంభం చెరువు అందాలు కనువిందు చేస్తున్నాయి. చెరువులో నీరు చేరడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు చెరువును సందర్శించేందుకు వస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మార్కాపురం ఇన్చార్జ్ ఆర్డీఓ, వెలిగొండ ప్రాజెక్ట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివరామిరెడ్డి, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలసి శనివారం కంభం చెరువును పరిశీలించారు.
కంభం చెరువుకు జలకళ
కంభం చెరువుకు జలకళ


