ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

Oct 26 2025 6:51 AM | Updated on Oct 26 2025 6:51 AM

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025 – 8లో.. వెరిఫికేషన్లకు రేట్‌ ఫిక్స్‌... ఒక్కొక్కరినే పిలిపించుకొని ...

న్యూస్‌రీల్‌

స్పెషల్‌ బ్రాంచ్‌ పనితీరుపై విమర్శలు అసలు విధులు మరిచి పక్కదారికి రాజకీయ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నార్న ఆరోపణలు ఏళ్ల తరబడి ఖాకీ దుస్తులు వేసుకోకుండా తిరుగుతున్న వారికి చెక్‌ సిబ్బంది అవినీతిపై ఐజీకి ఫిర్యాదులు విచారణకు ఆదేశాలు ఈ విభాగంలో ప్రక్షాళనకు రంగం సిద్ధం ఎస్బీ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరా ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడుతున్న ఎస్పీ హర్షవర్థన్‌ రాజు

పోలీస్‌శాఖలో అత్యంత కీలకంగా ఉండే స్పెషల్‌ బ్రాంచ్‌ జిల్లాలో గాడి తప్పుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతరం నిఘా ఉంచి ఎలాంటి నేరం జరగకుండా పోలీసు శాఖను అప్రమత్తం చేయాల్సిన ఈ విభాగం అధికారులు, సిబ్బంది పనితీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడైనా సరే చీమ చిటుక్కుమన్నా వెంటనే సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు ఉప్పందించాలి. ఎలాంటి నేరం జరగకుండా పోలీసు శాఖను అప్రమత్తం చేయాలి. అయితే అందుకు భిన్నమైన వాతావరణం నెలకొందన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో స్పెషల్‌ బ్రాంచి పూర్తిగా వైఫల్యంపై ఎస్సీ హర్షవర్ధన్‌రాజు దృష్టిసారించినట్టు తెలిసింది. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టనున్నట్టు పోలీస్‌శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగాలు, పాస్‌పోర్టులకు సంబంధించి నిర్వహించే వెరిఫికేషన్‌లకు ఒక రేటు నిర్ణయించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వెరిఫికేషన్‌కు గాను వ్యక్తిని బట్టి, అతడి స్థాయిని బట్టి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎవరైనా అడిగినంత ఇవ్వకపోతే నిబంధనల పేరిట రోజుల తరబడి తిప్పుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా పేకాట శిబిరాలు, సింగిల్‌ నంబర్‌ లాటరీ, స్పా, కోతముక్క నిర్వాహకుల నుంచి నెలవారి మామూళ్లు వసూలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా వీరయ్య చౌదరి హత్య కేసు విచారణ సమయంలో కూడా పలువురు ఎస్బీ సిబ్బంది వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రేషన్‌ మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్‌ యజమానుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులతో కుమ్మకై ్క ప్రజలను వేధిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన కొందరు ఎస్బీ సిబ్బంది అవినీతిపై ఐజీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం గురించి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంటిలిజెన్స్‌ అధికారులను ఐజీ ఆదేశించినట్లు తెలుస్తోంది.

జిల్లాలో స్పెషల్‌ బ్రాంచి ప్రక్షాళనకు ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారుల పనితీరును నిశితంగా పరిశీలిస్తున్న ఆయన తొలుత స్పెషల్‌ బ్రాంచిని పూర్తిగా ప్రక్షాళన చేయడం అవసరమని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో పనిచేస్తున్న ఎస్బీ సిబ్బంది వివరాలను తెప్పించుకున్న సమాచారం. ఒక్కొక్కరినీ పిలిపించుకొని ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారాన్ని చేతిలో పెట్టుకొని మాట్లాడుతుండడంతో పలువురు ఎస్బీ సిబ్బంది గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లుందని సమాచారం. ముఖ్యంగా దీర్ఘకాలంగా ఎస్బీలో పాతుకొనిపోయిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది.

వైఫల్యాల్లో

స్పెషల్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

శాంతి భద్రతల పరిరక్షణలో స్పెషల్‌ బ్రాంచి పాత్ర ఎంతో కీలకం. నేరుగా రంగంలోకి రానప్పటికీ తెరవెనక ఉండి మొత్తం పోలీసు శాఖను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఈ విభాగానిది. అయితే ఇక్కడ పనిచేస్తున్నవారు అసలు విధులను వదిలిపెట్టి ఇతర వ్యాపకాలతో కాలయాపన చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ విధులను విస్మరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

15 ఏళ్లుగా ఖాకీ దుస్తులు వేయని సిబ్బందిపై దృష్టి...

జిల్లాలో గత 15 –20 ఏళ్లుగా ఖాకీ దుస్తులు వేసుకోకుండా పోలీసు ఉద్యోగం చేస్తున్నవారు అనేకమంది ఉన్నారు. స్పెషల్‌ బ్రాంచిలో విధులు నిర్వహిస్తున్న వీరు ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టవేశారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వహించకుండా ఇతర వ్యాపకాలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఉద్యోగిలా కాకుండా అధికార పార్టీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు శాఖలో కిందిస్థాయి సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఎస్బీ సిబ్బందిపై విపరీతమైన విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న బదిలీల్లో కూడా వీరు జోక్యం చేసుకుంటున్నట్లు ప్రచారం. గత ఏడాది జిల్లాలో సుమారు 70 మందికి పైగా పోలీసులను అటాచ్‌ చేశారు. ఈ ఇద్దరు ఎస్బీ సిబ్బంది నిర్వాకం వల్లనే అటాచ్‌మెంట్‌ జరిగినట్టు పోలీసు ఉద్యోగులే విమర్శలు గుప్పించడం గమనార్హం. జిల్లాలోని ఒక కీలక ఎమ్మెల్యే అండదండలతో ఇద్దరు ఎస్బీ ఉద్యోగులు పెట్రేగిపోయినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామరాజు కేసులో కాకినాడ నుంచి విచారణకు వచ్చిన తులసీబాబు అనుచరులు ఎస్పీ కార్యాలయం వద్ద నానా రగడ సృష్టించడం తెలిసిందే. ఒక ఎస్బీ హెడ్‌ కానిస్టేబుల్‌ అత్యుత్సాహం, మితిమీరిన జోక్యం వల్లనే తులసీబాబు అనుచరులు గొడవకు దిగినట్లు ప్రచారం జరిగింది. తాజాగా జిల్లాలో పోలీసుల బదిలీల విషయంలో కూడా సదరు ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్‌ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది.

వీరయ్య హత్య కేసులో వైఫల్యం...

తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించడం తెలిసిందే. తాలుకా పోలీసు స్టేషన్‌, రూరల్‌ పోలీసు స్టేషన్లకు కూతవేటు దూరంలో ఈ హత్య జరిగింది. హత్యకు ముందు రెండు నెలలుగా రెక్కీ నిర్వహించినట్లు కూడా నిందితులు విచారణలో పేర్కొన్నారు. హైదరాబాద్‌, నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చిన నిందితులు రెండు నెలలుగా రెక్కీ చేస్తున్నా పసిగట్టడంలో స్పెషల్‌ బ్రాంచి పోలీసులు వైఫల్యం చెందినట్లు తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా నిందితులు వీరయ్యను హత్య చేసిన తరువాత దర్జాగా రూరల్‌, తాలుకా పోలీసు స్టేషన్ల మీదుగానే తప్పించుకొని పారిపోయారు. చీమకుర్తి వద్ద నిందితులు వాడిన స్కూటీ దొరికే వరకు ఎలాంటి సమాచారం కనుక్కోలేకపోయారన్న విమర్శలున్నాయి. నాగులుప్పలపాడు మండలంలో జరిగే కొలుపుల సందర్భంగా ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఈ సమాచారాన్ని ముందస్తుగా పసిగట్టడంలో కూడా ఎస్బీ వైఫల్యం చెందినట్లు ఆరోపణలు వచ్చాయి. జిల్లా కేంద్రానికి సమీప ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారిలో అత్యధిక శాతం మంది నగరంలోనే తిష్టవేసి తెరవెనుక వ్యవహారాలు నెరుపుతున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement