
పోలీసు అమరవీరులకు ఘన నివాళి
అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి, కలెక్టర్, ఎస్పీ తదితరులు
ఒంగోలు టౌన్:
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డీబీవీ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ వి.హర్షవర్థన్‌రాజు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు ఘనంగా నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు. ఈ సమయంలో భారీ వర్షం కురవగా కార్యక్రమాన్ని అలాగే కొనసాగించారు. మంత్రి స్వామి మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి స్వామి చెప్పారు. విధి నిర్వహణలో జిల్లాలో గత ఏడాది 13 మంది పోలీసు సిబ్బంది మరణించినట్లు తెలిపారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. దేశభద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్న పోలీస్ సిబ్బంది మన అందరికీ గర్వకారణమన్నారు. విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడంలోనూ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
ఎస్పీ హర్షవర్థన్‌రాజు మాట్లాడుతూ.. 1959 అక్టోబర్ 21వ తేదీన లడఖ్‌లో హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో చైనా దురాక్రమణకు పాల్పడగా, రక్తాన్ని గడ్డకట్టించే చలిలోనూ భారత జవాన్లు వీరోచిత పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో 10 మంది జవాన్లు అశువులుబాశారని, వారి త్యాగానికి గుర్తుగా ఏటా అక్టోబరు 21 న శ్రీపోలీసు అమర వీరుల సంస్మరణ దినం్ఙ నిర్వహించుకుంటున్నామని వివరించారు, ఇటీవలే భారత ప్రభుత్వం అక్టోబర్ 21వ తేదీని శ్రీనేషనల్ పోలీస్ డ్ఙేగా ప్రకటించిందని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ, లేళ్ల శంకర్, మోటా ఆంజనేయులు, కె.వి ప్రశాంతరావు, చప్పిడి వెంకటరత్నం, కీర్తిశేషులు ఎస్‌కే మహమ్మద్ రఫీ, ఈ.పవన్‌కుమార్ త్యాగాన్ని ఎస్పీ కొనియాడారు. కార్యక్రమంలో సంతనూతలపాడు, కనిగిరి ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) నాగేశ్వర రావు, ఒంగోలు మేయర్ జి.సుజాత, పీడీసీసీబీ చైర్మన్ సీతారామయ్య, మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్.లక్ష్మానాయక్, ఉప రవాణా శాఖ కమిషనర్ అర్.సుశీల, ఒంగోలు, దర్శి, కనిగిరి డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ క్లినిక్ డాక్టర్ భానుమతి, సీఐలు, ఎస్సైలు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
స్మృతి పరేడ్‌లో నివాళులర్పిస్తున ్న
పోలీస్
సిబ్బంది
పుష్పాంజలి ఘటించిన మంత్రి డోలా,
జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం
కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు భరోసా

పోలీసు అమరవీరులకు ఘన నివాళి

పోలీసు అమరవీరులకు ఘన నివాళి