25న ఏకేవీకే కాలేజీలో జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

25న ఏకేవీకే కాలేజీలో జాబ్‌ మేళా

Oct 22 2025 9:18 AM | Updated on Oct 22 2025 9:18 AM

25న ఏకేవీకే కాలేజీలో జాబ్‌ మేళా

25న ఏకేవీకే కాలేజీలో జాబ్‌ మేళా

25న ఏకేవీకే కాలేజీలో జాబ్‌ మేళా అసంబద్ధంగా డీఏ జీఓలు డీఏ జీవోను తక్షణమే సవరించాలి గందరగోళంగా డీఏ జీఓలు గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానుల చర్చలు విఫలం

ఒంగోలు సబర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీ ఒంగోలు ఏకేవీకే డిగ్రీ కాలేజీలో భారీ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ పీ.రాజా బాబు పేర్కొన్నారు. ఈ జాబ్‌ మేళా పోస్టర్లను కలెక్టర్‌ పీ.రాజబాబు మంగళవారం ఆయన ఛాంబరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ మేళాలో బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇంటర్‌ నుంచి డిగ్రీ, పీజీ వరకు అర్హత ఉన్న అభ్యర్థులు ఈ జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్‌ మేళాలో బహుళ జాతీయి 23 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు.మొత్తం 1000కి పైగా ఉద్యోగ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. జీతాలు రూ.11 వేల నుంచి రూ.35 వేల వరకు ఉండగా, కొన్ని కంపెనీలు ప్రోత్సాహకాలు, ఇతర భత్యాలు కూడా అందిస్తున్నాయి. ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్డులో ఉన్న ఏకేవీకే డిగ్రీ కాలేజ్‌లో జరుగుతాయని సంప్రదించాల్సిన నంబర్లు: 9573798594, 7842004344 వీటితో పాటు ఏపీఎస్‌ఎస్‌డీసీ కమాండ్‌ కంట్రోల్‌ నంబర్లు: 9988853335, 8712655686, 8790118349, 8790117279 సంప్రదించవచ్చన్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ

ఒంగోలు టౌన్‌: దీపావళి పండక్కి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన డీఏ జీఓలు అసంబంధంగా ఇచ్చారని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 21 నెలలపాటు ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పడం తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదని, మన దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానం లేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, రెండు డీఏలు ఇచ్చి, పీఆర్సీ ప్రకటిస్తారని 16 నెలలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చిందన్నారు.

యూటీఎఫ్‌ జిల్లా శాఖ డిమాండ్‌

ఒంగోలు సిటీ: యూటీఎఫ్‌, ఇతర ఉపాధ్యాయ సంఘాల పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌తో చర్చించి ఇచ్చిన జీవోలను 60, 61 ను తక్షణమే సవరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్‌ అబ్దుల్‌ హై, డీ వీరాంజనేయులు మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర ముఖ్యమంత్రి, గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌, అధికారులతో చర్చించే సందర్భంలో కనీస ప్రస్తావనకు రాని అంశాలను డీఏ జీవోలలో ప్రస్తావించడాన్ని యూటీఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.

ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ డిమాండ్‌

ఒంగోలు సిటీ: కరువు భత్యం (డీఏ) ఉత్తర్వులు జీఓ 60, 61 లను తక్షణమే సవరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జనార్ధనరెడ్డి, డి.శ్రీనివాసులు మంగళవారం డిమాండ్‌ చేశారు. వారు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు డీఏ లు ఇవ్వాల్సి ఉన్నా నేడు కేవలం ఒకే ఒక డీఏ మాత్రం మొక్కుబడిగా విడుదల చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయులను ఆందోళన, గందరగోళానికి గురిచేసేలా నేడు జీవోలు విడుదల చేయడం విచారకరమన్నారు.

చీమకుర్తి: గ్రానైట్‌ రాయల్టీ వసూళ్లకు కాంట్రాక్ట్‌ తీసుకున్న ఏఎంఆర్‌ సంస్థ ప్రతినిధులకు, ఉమ్మడి జిల్లాలోని గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానుల సంఘాల ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం ఒంగోలులోని ఏఎంఆర్‌ కార్యాలయంలో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. గ్రానైట్‌ ఫ్యాక్టరీలోని కటింగ్‌ బ్లేడ్‌కు ప్రభుత్వం నిర్ణయించిన రూ.35 వేలను మాత్రమే చెల్లిస్తామని, అనధికారికంగా అడిగే రూ.35 వేలను మాత్రం ఇచ్చే పనిలేదని ఫ్యాక్టరీల యజమానులు తేల్చిచెప్పారు. కానీ అదనపు డబ్బులు ఇవ్వకపోతే ససేమిరా అని ప్రైవేటు సంస్థ చెప్పటంతో ఇరువురి మధ్య చర్చలు అర్ధంతరంగా నిలిచిపోయాయని ఫ్యాక్టరీల యజమానులు మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement