
చెంచుపాలెంలో వైద్య శిబిరం ఏర్పాటు
పొన్నలూరు: మండలంలోని మాలపాడు పంచాయతీ చెంచుపాలెం గ్రామానికి చెందిన అంగన్‌వాడీ హెల్పర్ గుదే రామసుబ్బులు(47) డెంగీ లక్షణాలతో పాటు లూపస్ అనే వ్యాధితో గత శుక్రవారం రాత్రి మరణించింది. రెండు వారాల క్రితం ఆమెకు డెంగీ లక్షణాలు ఉండటంతో పాటు రక్త కణాలు తగ్గిపోవడంతో ప్రైవేట్ హాస్పటల్‌లో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ రామసుబ్బులు మృతిచెందింది. దీనిపై శనివారం సాక్షిలో ‘డెంగీతో అంగన్‌వాడీ హెల్పర్ మృతి’ అనే శీర్షికతో వార్త ప్రచురితం కావడంతో స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం పొన్నలూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో చెంచుపాలెం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరంతో పాటు ఇంటింటికీ ఫీవర్ సర్వే చేయించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. అలాగే పంచాయతీ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు చేపట్టి బ్లీచింగ్ చల్లించారు.

చెంచుపాలెంలో వైద్య శిబిరం ఏర్పాటు